- ప్రజా ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగా ఉండొద్దు..
- ప్రజా శాంతికి భంగం కలిగించేల శబ్దం పెట్టొద్దు..
- ఎవరైనా ఉత్తర్వులను అతిక్రమించినచో కఠిన చర్యలు తప్పవు
- కోదాడ పట్టణ సిఐ రామ వెల్లడి
ఇదే నిజం, కోదాడ: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వివాహాలు ఇతర ఏ రకమైన వేడుకల్లోనైనా, ప్రజా ఆరోగ్యాన్ని దెబ్బ తీసే విధంగా, ప్రజాశాంతి భంగం కలిగించే విధంగా డీజేలను శబ్ద కాలుష్యాన్ని చేయకూడదని కోదాడ పట్టణ సిఐ రాము తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం ఉన్న పోలీస్ స్టేషన్ లో డీజే ఓనర్లను ఆపరేటర్లను పిలిపించి మాట్లాడారు. ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను అతిక్రమించిన యడల డీజే ఆపరేటర్ పై వేడుక నిర్వహించే వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకొని డీజే లను సీజ్ చేయబడునని తెలిపారు. డీజే ఓనర్స్ ఆపరేటర్ పోలీస్ వారికి సహకరించాలని కోరారు.