Homeహైదరాబాద్latest Newsరుణమాఫీ ఇక లేనట్టేనా.. ఆ రైతుల పరిస్థితేంటి..?

రుణమాఫీ ఇక లేనట్టేనా.. ఆ రైతుల పరిస్థితేంటి..?

తెలంగాణ లో రుణమాఫీ, రైతు భరోసా ల కోసం రైతులు ఎంతగా ఎదురు చూస్తున్నారో మనందరికీ తెలిసిందే. అయితే రుణమాఫీ పథకం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. 4 విడతలుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. అయితే చాలా మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. తెలంగాణ సర్కార్ రూ. 2 లక్షలలోపు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని చెప్పింది. అందుకు తగ్గట్టుగానే అర్హులను గుర్తించివారి ఖాతాల్లో ఇప్పటి వరకు నాలుగు విడతల్లో డబ్బులను విడుదల చేశారు. అయితే మరోవైపు రూ.2 లక్షల వరకు రుణాలన్నీ 100 శాతం పూర్తయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల స్పష్టం చేశారు. 100 శాతం రుణమాఫీ పూర్తయిందని సీఎం ప్రకటన నేపథ్యంలో… పలువురు రైతులు అయోమయంలో పడ్డారు. అర్హులైనప్పటికీ రుణమాఫీ అందలేదని వాపోతున్నారు.

Recent

- Advertisment -spot_img