Homeహైదరాబాద్latest News‘క’ సినిమా హిట్ కాకపోతే.. నేను..! కిరణ్ అబ్బవరం కామెంట్స్ వైరల్

‘క’ సినిమా హిట్ కాకపోతే.. నేను..! కిరణ్ అబ్బవరం కామెంట్స్ వైరల్

కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన సినిమా ‘క’. ఈ సినిమాకి సుజీత్- సందీప్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నయన్‌ సారిక హీరోయినిగా నటించింది. దీపావళి పండుగ కానుకగా అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటిటి సంస్థ ‘ఈటీవీ విన్’ నవంబర్ 28 నుండి స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సినిమా ఓటీటీలో ఒక్క రోజులోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను దాటేసింది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ఇటీవ‌ల ప్ర‌త్యేకంగా ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సినిమా మంచి విజయం సాధించడంతో హాప్యిగా ఉన్నాని తెలిపాడు. మంచి కంటెంట్‌తో సినిమాలు తీయాలనే నమ్మకం ఉంది..ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటాను అని కిరణ్ చెప్పాడు. అయితే ఈ సినిమా విజయం సాధించకపోతే సినిమాలను ఆపేస్తానని కిరణ్ అబ్బవరం సంచలన వ్యాఖ్యలు చేసాడు.

Recent

- Advertisment -spot_img