IPL 2024 సీజన్‌లో నిన్న అహ్మదాబాద్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన కీలక క్వాలిఫయర్-1లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యంతో పాటు బ్యాడ్ ఫీల్డింగ్ తో ఈ మ్యాచ్ లో కనీస పోటీ ఇవ్వలేదు. అయితే హోరాహోరీగా సాగుతుందని భావించిన క్వాలిఫయర్-1 ఎలాంటి మలుపులు లేకుండా ఏకపక్షంగా ముగిసింది. ఈ ఓటమితో ఫైనల్ చేరే అవకాశాన్ని కోల్పోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ శుక్రవారం చెన్నై వేదికగా జరిగే క్వాలిఫయర్-2లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
ఈ మ్యాచ్ లో ఓడినా.. క్వాలిఫయర్-2లో విజయం సాధించి సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ చేరుతుందని ఆరెంజ్ ఆర్మీ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వన్డే ప్రపంచకప్ సెంటిమెంట్ రిపీట్ అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ టైటిల్ కైవసం చేసుకుంటుందని అంచనాలు చెబుతున్నాయి. 2015లో ఆస్ట్రేలియా వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత సన్‌రైజర్స్ ఐపీఎల్ 2016ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. 2023 వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఛాంపియన్‌గా నిలిచింది.. దీనితో ఐపీఎల్ 2024 టైటిల్‌ను సన్‌రైజర్స్ గెలుస్తుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.