ఇదేనిజం, రాయికల్: రాయికల్ మండలం పరిధిలోని రోడ్డ పై కేజ్ వీల్ ట్రాక్టర్ల ను నడిపితే ట్రాక్టర్ యజమానులపై డ్రైవర్ల పై కఠినచర్యలు తీసుకుంటామని ఎస్ఐ అశోక్ హెచ్చరించారు. మండలాల్లోని ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు వరినాట్ల కోసం రోడ్డుపై కేజ్ వీల్స్ ట్రాక్టర్లు నడువుతున్నారని, దీంతో ప్రభుత్వం కోట్లాది రూపాయల తో నిర్మించిన రహదారులు ధ్వంసమవుతున్నాయని అన్నారు. రోడ్డ పై కేజ్ వీల్స్ ట్రాక్టర్లు నడిపిస్తే యాజమానులు, డ్రైవర్లు పై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆ ట్రాక్టర్లును సీజ్ చేస్తామని ఎస్ఐ అశోక్ తెలిపారు.