Homeహైదరాబాద్latest Newsవరంగల్ అభివృద్ధి జరిగితే సగం తెలంగాణ అభివృద్ధి జరిగినట్టే : సీఎం రేవంత్ రెడ్డి

వరంగల్ అభివృద్ధి జరిగితే సగం తెలంగాణ అభివృద్ధి జరిగినట్టే : సీఎం రేవంత్ రెడ్డి

హనుమకొండలో నిర్వహించిన ప్రజా పాలన-ప్రజా విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. వరంగల్ పట్టణాన్ని హైదరాబాద్ కు పోటీ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక చేశాం అని రేవంత్ రెడ్డి తెలిపారు. దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు వరంగల్ అభివృద్ధికి కేటాయించాం అని అన్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, వరంగల్.. ఉత్తర తెలంగాణ అభివృద్ధిపై ఫోకస్ పెట్టాం అని తెలిపారు. వరంగల్ అభివృద్ధి జరిగితే సగం తెలంగాణ అభివృద్ధి జరిగినట్టే అని రేవంత్ రెడ్డి తెలిపారు.
మహారాష్ట్ర, ఏపీలో ఎయిర్ పోర్టులు ఎక్కువగా ఉన్నాయి అని… తెలంగాణలో మాత్రం ఒకే ఒక్క ఎయిర్ పోర్ట్ ఉంది అని రేవంత్ రెడ్డి అన్నారు. మనకు కూడా నాలుగైదు ఎయిర్ పోర్టులు ఉండాల్సిన అవసరం ఉందిని రేవంత్ రెడ్డి తెలిపారు.

Recent

- Advertisment -spot_img