Homeహైదరాబాద్latest Newsచలికాలంలో ఇలా చేస్తే.. దురద మాయం..

చలికాలంలో ఇలా చేస్తే.. దురద మాయం..

ఇదేనిజం, ఫీచర్​​ డెస్క్​ : చలికాలంలో చాలా మందిని దురద సమస్య ఇబ్బంది పెడుతుంది. వారందరూ ఈ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ సీజన్‌లో చర్మం పొడిబారి దురదగా మారుతుంది. దీని నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుందాం. చలికాలంలో దురద రావడం, చర్మం పొడిబారిపోవడం వంటి సమస్యలు సాధారణం. చల్లటి గాలి ప్రభావం, వేడి నీటిని అతిగా ఉపయోగించడం వల్ల ఈ సమస్య వస్తుంటుంది. ఎక్కువ రోజులు ఒకే బట్టలు వేసుకోవడం వల్ల దురద ఇంకా ఎక్కువవుతుంది. చలికాలంలో క్రమం తప్పకుండా మాయిశ్చరైజర్ ఉపయోగిస్తే మంచిది. ఇది చర్మం పొడిబారకుండా చేస్తుంది అలాగే దురదను తగ్గిస్తుంది. చల్లని గాలిలో బయటకు వెళ్లేటప్పుడు మీ చర్మాన్ని రక్షించుకోవడానికి మఫ్లర్, క్యాప్ ఉపయోగిస్తే బాగుంటుంది. ఇలా చేయడం వల్ల అనారోగ్యానికి గురికాకుండా ఉంటారు. అంతేకాదు దురద సమస్యను కూడా నివారించవచ్చు. ఇక స్నానం చేయడానికి, తాగడానికి చాలా వేడి నీటిని ఉపయోగించాలి. అందువల్ల శరీరం, చర్మం పొడిబారడానికి కారణం కావోచ్చు. ఇది దురద ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి సాధారణ లేదా గోరువెచ్చని నీటిని మాత్రమే తాగాలి.

Recent

- Advertisment -spot_img