మహా శివరాత్రి శివ భక్తులకు చాలా ప్రత్యేకమైన రోజు అని చెబుతారు. ఈ రోజు మహా శివరాత్రి జరుపుకుంటారు. ఇది పూజలు నిర్వహించడానికి శుభ సమయం… మహా శివరాత్రి ప్రాముఖ్యత, ఉపవాసం ఎలా ఉండాలి.. మరిన్నింటి గురించి తెలుసుకుందాం. మహా శివరాత్రి రోజున రాత్రంతా భక్తులు మేలుకుని జాగరణ చేసి శివ భజనలలో లీనమై ఉంటారు. అయితే ఆ పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడం చాలా సులభమని అంటున్నారు. బిల్వపత్రం (మారేడు ఆకు), నీటితో శివ లింగాన్ని పూజిస్తే చాలు. అలాగే పెరుగులో తేనె కలిపి శివ లింగానికి అభిషేకం చెయ్యాలి. శివుడిని అభిషేక ప్రియుడు అని అంటారు. పెరుగులో తేనె కలిపి అభిషేకం చేయడం వల్ల శివుడు సంతోషిస్తాడని పండితులు చెబుతున్నారు.