‘కార్బ్ డైట్’ మెయింటైన్ చేస్తే టైప్-2 డయాబెటిస్ అదుపులో ఉంటుందని అలబామా యూనివర్సిటీ పరిశోధకుల తాజా అధ్యయనం వెల్లడించింది. ప్యాంక్రియాస్‌లోని బీటా కణాలు ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తున్నట్లు గుర్తించారు. కాబట్టి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే పాస్తా, వైట్ బ్రెడ్, షుగరింగ్ డ్రింక్స్, జంక్ ఫుడ్స్ వంటివి అవాయిడ్ చేయాలని చెబుతున్నారు.