భారీ వర్షాలు.. ఏపీని నిండా ముంచాయి. విజయవాడలో క్షేత్ర స్థాయి పర్యటన చేస్తున్న సీఎం చంద్రబాబు అధికారులపై సీరియస్ అయ్యారు. సహయక చర్యల్లో అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అనుకున్న స్థాయిలో ఆహారం తెప్పించగలిగినా పంపిణీ విషయంలో జాప్యంపై సమావేశంలో చంద్రబాబు సమీక్షించారు. పని చేయడం ఇష్టం లేకపోతే ఉద్యోగాలు వదిలేసి ఇంటికి వెళ్లాలంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు.