ఎండాకాలం, చలికాలం, వర్షాకాలంలోనూ కొబ్బరి నీళ్లు తాగవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే అనేక ఖనిజాలు, విటమిన్లు శరీరానికి మేలు చేస్తాయి. దీంతో పాటు వర్షాకాలంలో బలహీనమైన రోగనిరోధక శక్తి కారణంగా వ్యాధులు త్వరగా దాడి చేస్తాయి. కొబ్బరి నీటిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది. కొబ్బరి నీరు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. వర్షాకాలంలో ప్రవేశించే బ్యాక్టీరియాను కొబ్బరి నీరు నియంత్రిస్తుంది.