ఇటీవలి కాలంలో సైబర్ నేరగాళ్ల అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ నుంచి సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కాల్స్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. +92తో ప్రారంభమయ్యే నంబర్ల నుంచి కాల్ వస్తే లిఫ్ట్ చేయొద్దంటున్నారు. పోలీస్ యూనిఫాంలో ఉన్న ఫోటోలను డీపీగా పెట్టుకుని చీట్ చేస్తారని, నమ్మితే మోసపోతారని హెచ్చరిస్తున్నారు. ఆగ్రాకు చెందిన ఓ మహిళను ఇలాగే మోసగించడంతో ఆమె గుండెపోటుతో మరణించింది.