స్టార్ హీరోయిన్ త్రిష ప్రస్తుతం దక్షిణాదిలో చక్రం తిప్పుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిష బాలీవుడ్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
తాను హిందీలో నటించిన ‘కట్టామిఠా’ మూవీ హిట్ కాకపోవటంతో బాలీవుడ్‌లో అవకాశాలు తగ్గినట్లు చాలా మంది అనుకున్నారని తెలిపింది. నిజానికి దక్షిణాది సినిమాలు వదులుకోలేక, తన కుటుంబాన్ని ముంబైకి మార్చడానికి ఇష్టం లేక బాలీవుడ్ సినిమాలు వద్దనుకున్నానని చెప్పింది.