‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్‌కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. అలా కాకుండా బయట కూర్చుని అబద్ధాలు చెబుతూ ప్రజల్ని మభ్యపెడతారా అని జగన్‌ను చంద్రబాబు నిలదీశారు.