మంత్రి కొండా సురేఖ ఆరోపణలపై బిఆర్ఎస్ నేత ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ స్పందించారు. సభ్యత-సంస్కారం- మానవత్వం అంటే ఎంటో తెలియని మీకు, బీర్లు, బిర్యానీలు, రేవ్ పార్టీలు చేసుకుంటూ, విద్యార్థుల జీవితాలు నాశనం చేసిన సురేఖకు పేద గురుకుల విద్యార్థుల గురించి మాట్లాడే అర్హత లేదు అని ప్రవీణ్ కుమార్ అన్నారు. ధమ్ముంటే మీరు గురుకులాల మీద బహిరంగ చర్చకు రావాలి అని, అంతే కాని మత్తులో ఉన్న ఈ మతి స్థిమితం లేని మంత్రులను, భజంత్రీలను పంపించి నవ్వులపాలు కాకండి అని ప్రవీణ్ కుమార్ అన్నారు.