టీటీడీ అధికారులు సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పించడానికి పెద్ద ఎత్తున ఇలాంటి చర్యలు తీసుకుంటోండగా.. మరోవంక అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తమ అనుచరులతో తిరుమలలో హల్‌చల్ చేస్తోండటం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. చంద్రగిరికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని ఏకంగా 300 మంది అనుచరులతో తిరుమలలో శ్రీవారి దర్శించుకోవడం వివాదాస్పదమౌతోంది. అది కూడా బ్రేక్ దర్శన సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతోన్నాయి.