మన దేశంలో నదులను పూజించడం ఒక ఆనవాయితీ. నదులను పూజించడంతో తాము కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చాలా మంది నదుల్లో నాణాలు కూడా వేస్తుంటారు. కానీ అందులో నిజమేంటంటే.. గతంలో నాణేలను రాగితో చేసేవాళ్లు. రాగి నీటిని శుద్ధి చేస్తుందని సైన్స్ చెబుతోంది. రాగి నాణేలను నదుల్లో వేసినప్పుడు, అవి నీటిని శుభ్రం చేసేవి. ఆ నీటిని తాగినప్పుడు ప్రజలు ఆరోగ్యంగా ఉండేవారు. అందుకే రాగి నాణేలను నదుల్లో వేయడం ఒక సంప్రదాయంగా మారింది.