బ్యాంకులు ఆకస్మిక నగదు అవసరాలకు వ్యక్తిగత రుణాలను అందిస్తాయి. దాదాపు అన్ని బ్యాంకులు వ్యక్తిగత రుణాలను అందిస్తుంటాయి. బ్యాంకులను బట్టి నిబంధనలు, వడ్డీ రేట్లు వేరు వేరుగా ఉంటాయి. అయితే HDFC బ్యాంక్ లో మీరు రూ.11 లక్షల రుణం తీసుకుంటే.. నెలకు EMI ఎంత కట్టాలి, వడ్డీ రేట్లు ఎలా ఉంటాయో తెలుసుకుందాం..
HDFC బ్యాంక్ 10.85% నుండి 24% వరకు వ్యక్తిగత రుణ వడ్డీ రేట్లను అందిస్తుంది. మంచి క్రెడిట్ స్కోరు ఉన్నవారికి తక్కువ వడ్డీ రేట్లు అందించబడతాయి. ఏడు సంవత్సరాల పాటు రూ.11 లక్షల వ్యక్తిగత రుణం తీసుకుంటే, అతను నెలకు రూ.18,748 EMI చెల్లించాలి. వ్యక్తిగత రుణ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.6,500 బ్యాంకు వసూలు చేస్తుంది.
ALSO READ: ఫిబ్రవరి 1 నుండి UPI లావాదేవీలు రద్దు.. ఎందుకంటే..?