హైదరాబాద్: మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై వాహనాలను నిలిపి సెల్ఫీలు, ఫోటోలు తీసుకోవద్దని పోలీసులు సూచించారు. ఎవరైనా నిబంధనలు పాటించకపోతే జరిమానా విధిస్తామని తెలిపారు. కేబుల్ బ్రిడ్జిపై తరుచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా ఫోటోలు, సెల్ఫీలు దిగాలనుకుంటే వాహనాలను ఐటీసీ కోహినూర్ వద్ద పార్కింగ్ స్థలంలో వాహనాలు నిలిపి బ్రిడ్జి పై ఉన్న ప్రత్యేక ట్రాక్‌పై మాత్రమే తీసుకోవాలన్నారు.