Ilayaraja : తమిళ స్టార్ హీరో అజిత్ హీరోగా నటించిన ”గుడ్ బ్యాడ్ అగ్లీ” అనే సినిమా ఏప్రిల్ 10 థియేటర్లో విడుదలైంది. ఈ సినిమా తమిళ, తెలుగు బాషల్లో ఘన విజయం సాధించింది. అయితే అజిత్ సినిమా వివాదంలో చిక్కుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ”గుడ్ బ్యాడ్ అగ్లీ” సినీ నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపించారు. తన అనుమతి లేకుండా సినిమాలో పాటలను వాడుకున్నారని ఆరోపించారు.
గతంలో తాను సంగీతం అందించిన మూడు పాటలను తన అనుమతి, హక్కులు లేకుండా ”గుడ్ బ్యాడ్ అగ్లీ” సినిమాలో ఉపయోగించారని ఇళయరాజా నోటీసుల్లో పేర్కొన్నారు. ఇది కాపీరైట్ చట్టాలను స్పష్టంగా ఉల్లంఘించడమేనని ఆయన అన్నారు. ఈ క్రమంలో తనిఖీ సినిమా నిర్మాతలు రూ. 5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అయితే దీనిపై ఇప్పటివరకు చిత్రబృందం అధికారికంగా స్పందించలేదు.