Homeహైదరాబాద్latest Newsప్రభుత్వం వైఫల్యాలను ఎత్తి చూపినందుకే.. కేటీఆర్ పై అక్రమ కేసులు..!

ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తి చూపినందుకే.. కేటీఆర్ పై అక్రమ కేసులు..!

కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. తాజాగా కేటీఆర్ నివాసంలో హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం డైవర్షన్‌ రాజకీయాలు చేస్తోంది. ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో ఎలాంటి అవినీతి జరగలేదు. ప్రభుత్వం నుంచి గ్రీన్-కో కంపెనీకి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ప్రభుత్వ వైఫల్యాలను కేటీఆర్ ఎత్తి చూపుతున్నాడు కాబట్టే.. కేటీఆర్ పై రేవంత్ రెడ్డి అక్రమ కేసులు పెడుతున్నాడు’ అని దుయ్యబట్టారు. రైతు భరోసాను రూ.15 వేల నుంచి రూ.12 వేలకు తగ్గించారు. రైతు భరోసా నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు, అక్రమ కేసులకు భయపడేది లేదని హరీష్ రావు అన్నారు.

ALSO READ

కేటీఆర్ కు ఎదురుదెబ్బ.. తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు.. బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన..!

BREAKING: సుప్రీం కోర్టును ఆశ్రయించనున్న కేటీఆర్..?

Recent

- Advertisment -spot_img