Homeఆంధ్రప్రదేశ్Malkajrigi సర్కిల్‌లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు…!

Malkajrigi సర్కిల్‌లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు…!

ఇదేనిజం, మల్కాజిగిరి: మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ప్రధాన రహదారి పక్కనే అనుమతులకు విరుద్ధంగా వెలుస్తున్న నిర్మాణాలపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేరేడ్ మెట్ నుంచి మల్కాజిగిరి వెళ్లే ప్రధాన రహదారి పక్కనే కమర్షియల్ నిర్మాణాలతో పాటు ఆదనపు అంతస్తులు వెలుస్తున్న అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలపై అధికారులు ఏలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదని దీనికి సిబ్బంది కొరతతో పాటు నాడు ఎన్నికల నిర్వహన, నేడు ప్రజాపాలన కార్యక్రమంలో అధికారులు బిజీగా ఉండటంతో ఇదే అదనుగా తీసుకుని దర్జాగా అదనపు అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నారని తెలుస్తోంది.

నేరేడ్మేట్, వినాయక్ నగర్, మల్కాజిగిరి, ఈస్టు ఆనంద్ బాగ్ , మౌలాలీ, గౌతంనగర్ డివిజన్ల పరిధిలో వెలుస్తోన్న సెల్లార్లు, కమర్షియల్ నిర్మాణాలు, ఆదనపు అంతస్థుల నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్న అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడటం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. స్థానిక కార్పొరేటర్లు , టౌన్ ప్లానింగ్ అధికారుల కనుసైగల్లోనే అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికైనా జోనల్ కమిషనర్ స్పందించి ఇక్కడి అక్రమ నిర్మాణాలపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Recent

- Advertisment -spot_img