Homeహైదరాబాద్latest Newsమళ్ళంపేట్ లో జోరుగా అక్రమ నిర్మాణాలు

మళ్ళంపేట్ లో జోరుగా అక్రమ నిర్మాణాలు

ఇదే నిజం, కుత్బుల్లాపూర్: దుందిగల్ మున్సిపల్ పరిధి మల్లంపేట్ మదాసు రామచంద్ర కాలనీలో జోరుగా అక్రమ నిర్మానాలు చేపడుతున్నారు. దుందిగల్ మున్సిపల్ పరిది మదాసు రామచంద్ర కాలనీలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి ఈ అక్రమ నిర్మాణాలు నిదర్శనం. అనుమతులు లేకుండా 500 గజాల స్థలంలో అయిదు అంతస్తుల భారీ భవనం నిర్మిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించే నిర్మాణాలకు మరింత ప్రోత్సాహం అందిస్తున్నారు మున్సిపల్ అధికారులు.

అనుమతులు లేకుండా అయిదు అంతస్తుల నిర్మాణం
అధికారుల అండ చూసుకుని అక్రమ నిర్మాణ దారులు ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారు. దుందిగల్ మున్సిపల్ అధికారుల విధులు అక్రమార్కుల కోసం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మళ్లంపేట్ మాదాస్ కాలనీలో ఓ నిర్మాణ సంస్థ పేరుతో 500 గాజాల్లో అయిదు అంతస్తుల అక్రమ నిర్మాణం చేపడుతున్నారు. గతంలో హెచ్ఎండీఏ అనుమతులకు దరఖాస్తు చేసుకున్నా నిబంధనలు, సెట్ బ్యాక్ లు పాటించకపోవడంతో దరఖాస్తు తిరస్కరించినట్లు సమాచారం. నిర్మాణ పనులు మాత్రం ఆపకుండా యదావిధిగా కొనసాగించడం గమనార్హం. నేతల సిఫార్సుల మేరకు అధికారుల ముడుపులే కావచ్చు పనులు మాత్రం ఆపకుండా కొనసాగిస్తున్నారు.

భారీగా ముడుపులు…
ఇలాంటి భవంతులు అక్రమ కట్టడాల నిర్మాణంలో కార్పొరేషన్ అధికారులు భారీగా ముడుపులు తీసుకుని అనుమతులు మంజూరు చేస్తుంటే అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు ఇలాంటి దందాలో వేలుపెట్టి కోట్లు సంపాదిస్తున్నారు. అందువల్లే అక్రమ కట్టడాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.

రోడ్డు మీదే అక్రమంగా బోర్ వెల్
సదరు అక్రమ నిర్మానదారుడు నిర్మాణంతో పాటు రోడ్డు మీదే బోర్ వెల్ వేశాడు. ఈ విషయాన్ని ఏఈ దృష్టికి తీసుకువెళ్ళగా పలుమార్లు బోర్ నిలిపివేసినా, మళ్లీ యదావిధిగా బోర్ వేశాడని అధికారులు చెప్పడం గమనార్హం.

Recent

- Advertisment -spot_img