Homeక్రైంవివాహేతర సంబంధం.. మెడలో బూట్ల దండలు.. ఊర్లో ఊరేగింపు.. రూ.5లక్షల ఫైన్​

వివాహేతర సంబంధం.. మెడలో బూట్ల దండలు.. ఊర్లో ఊరేగింపు.. రూ.5లక్షల ఫైన్​

రాంచీ: జార్ఖండ్‌లో వివాహేతర సంబంధం పెట్టుకున్నారన్న కారణంతో గ్రామపంచాయతీ పెద్దలు పంచాయతీ పెట్టారు. ఆ జంటకు రూ.5లక్షల ఫైన్​ వేశారు. ఇలాంటి తప్పుడు పనులు ఊర్లో ఎవరూ చేయొద్దని.. చెప్పుల దండలు వేసి ఊర్లో ఊరేగించారు. ఆ వీడియో వైరల్​ కావడంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని కాపాడారు.
వివరాల్లోకెళ్తే..
జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్‌లోని జుహిబోనా గ్రామానికి సమీపంలో ఈ సంఘటన జరిగింది. బకూరీకి చెందిన ఓ మహిళ మోడికోలా గ్రామంలో వివాహం చేసుకుంది. అయితే ఈ మధ్య శివ పహాద్‌ ప్రాంతంలోని తన బంధువులతో కలిసి ఉండటానికి వచ్చింది. ఈ క్రమంలో జుహిబోనా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడి, అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామపెద్దలు ఈ జంటను గ్రామపంచాయతీకి పిలిచారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img