Homeహైదరాబాద్latest Newsచెరువులల్లో అక్రమ మట్టి తవ్వకాలు.. నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్న ఇరిగేషన్ ఉన్నతాధికారులు

చెరువులల్లో అక్రమ మట్టి తవ్వకాలు.. నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్న ఇరిగేషన్ ఉన్నతాధికారులు

ఇదే నిజం, గూడూరు: మండల కేంద్రానికి కూత పెట్టు దూరంలో, 365 జాతీయ రహదారికి అతి సమీపంలో, కోడి చెరువు, తాళ్ళకుంట, కొత్త కుంట, మర్రి మిట్టను అనుకొని ఉన్న జమ్మికుంట, గూడూరు కేంద్రం పరిధిలోని పొనుగోడు, చిర్రకుంట, రాములు తండా, అలాగే నేడు అయోధ్యాపురం ఊర చెరువులో అక్రమా మట్టి తవ్వకాలు జరుగుతున్న నేపథ్యంలో, ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ ఉపేందర్ డి ఈఈ కి ఫిర్యాదు చేసినా ఏమి ఫలితం లేకపోయింది. మండల కేంద్రంలోని అన్ని చెరువులల్లో, అక్రమ మట్టి తవ్వకాలు నిరంతరం జరుగుతున్న, స్పందించని రెవెన్యూ, ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ లా ఉన్నతాధికారులు. అనేకమార్లు ప్రజలు, రైతులు ఫిర్యాదులు చేసిన పర్యావేక్షణ చేయకపోవడానికి, ప్రేక్షక పాత్ర వహించడానికి గల కారణాలు ఏమిటని? ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ అధికారులకు, నిరభ్యంతరంగా మట్టి తవ్వకాలు జరుపుతున్న కాంట్రాక్టర్లకు ఏదో తెలియని అవినావ సంబంధం ఉండడం చేతనే స్పందించడం లేదని, రెవెన్యూ శాఖ, ఇరిగేషన్ శాఖ, అలాగే ఆర్డీవో కార్యాలయంలో కొంతమంది ఉన్నతాధికారుల, వివిధ పార్టీల రాజకీయ నాయకుల అండదండలతోనే ఆటంకాలు లేకుండా అక్రమ మట్టి తవ్వకాల దందా కొనసాగుతుందని, అధికారులపై ఒత్తిడి పెంచిన కొద్ది యుద్ధ ప్రాతిపదికన మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని, ఇప్పటికైనా మహబూబాబాద్ జిల్లా ఉన్నతాధికారుల యంత్రాంగం తమ ఉద్యోగ ధర్మాన్ని నిష్పక్షపాతంగా నిర్వర్తించాలని, వీరిపై ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలని, మేధావులు, విశ్లేషకులు, సామాన్య గూడూరు మండల ప్రజానికం కోరుకుంటున్నారు.

Recent

- Advertisment -spot_img