Imanvi Ismail : ప్రభాస్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ”ఫౌజీ” అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా పాకిస్తాన్ బ్యూటీ ఇమాన్వి ఇస్మాయిల్ నటిస్తోంది. అయితే పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో ఈ నటిని సినిమా నుంచి తొలగించాలని నెటిజన్లు మరియు కొందరు ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియా వేదికలలో డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇమాన్ వీ షాజీని సినిమా నుంచి బ్యాన్ చేయాలనీ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.
తాజాగా ఈ వివాదంపై ఇమాన్వి స్పందించింది. ఈ క్రమంలో ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. ఇమాన్వీ పాకిస్తాన్‌కు చెందిన సైనికాధికారి కుమార్తె అని, పాకిస్తాన్‌తో సంబంధం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఆ ఆరోపణలను ఇమాన్వీ తీవ్రంగా ఖండించింది. పహల్గామ్ హింసను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నా సంతాపం. నా గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. నా కుటుంబంలో ఎవరికీ పాకిస్తాన్ సైన్యానికి ఎలాంటి సంబంధం లేదు. నేను లాస్ ఏంజిలిస్‌లో పుట్టాను. నేను హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ, తెలుగు మాట్లాడే భారత సంతతికి చెందిన అమ్మాయిని. మా పేరెంట్స్ అమెరికన్ సిటిజన్స్ అని చెప్పింది. ఈ బాధాకర సమయంలో ద్వేషాన్ని కాదు, ప్రేమను వ్యాప్తి చేయండి. ఈ క్రమంలో పాకిస్థాన్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఇమాన్వి స్పష్టం చేసింది.