రానున్న ఐదు రోజుల పాటు తూర్పు, దక్షిణ భారతదేశంలో వేడిగాలులు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. పశ్చిమ బెంగాల్, ఒడిశా తీర ప్రాంతాలతో పాటు సిక్కిం, కర్ణాటకల్లో భానుడు నిప్పులు కురిపిస్తుందని ఐఎండీ వెల్లడించింది. అలాగే బీహార్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా వేడిగాలుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. పశ్చిమ బెంగాల్‌కు IMD రెడ్ అలర్ట్ ప్రకటించింది.అన్ని వయసుల వారు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.దేశంలోని ఈశాన్య ప్రాంతాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.