Homeహైదరాబాద్latest Newsభూ ఆక్రమనలపై తక్షణం స్పందించాలి

భూ ఆక్రమనలపై తక్షణం స్పందించాలి

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం గాదేపల్లి గ్రామంలో ప్రభుత్వ భూములను పెద్ద ఎత్తున కొందరు అక్రమంగా ఆక్రమణలు చేస్తుంటే అధికారులు నిమ్మకు నీరెత్రినట్టుగా వ్యవహరించడం తగదని అధికారులు, ప్రజాప్రతినిధులు నాయకులు తక్షణం స్పందించాలని ఎమ్మెల్యే పరాజితుల బృందం హెచ్చరించారు. బుధవారం రోజున జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో గాదెపెళ్లి శివారులోని వందల ఎకరాల ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యే పరాజితులు జాడి ప్రేమ్ సాగర్,దూడ మహిపాల్, షేర్ల మహేంద్,జర్నలిస్ట్ విక్రమ్ రెడ్డి వేముల బృందంగా కలియతిరిగి పరిశీలించి అనంతరం మాట్లాడారు… వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం లో పెద్ద ఎత్హున కబ్జాలు జరుగగా మళ్ళీ ఇప్పుడు కొంతమంది నాయకులు అధికారుల అండతో తప్పుడు ధ్రువపత్రాల తో ఇష్టారీతిన కబ్జాలకు పాల్పడుతున్నారు .ఉన్నతాధికారులు స్థానిక ఎమ్మెల్యే తక్షణం స్పందించి కబ్జాదారులను కాళీ చూపించి చట్టప్రకారం చర్యలు చేపట్టాలి,అట్టి ప్రభుత్వ భూమి అమ్మడం కొనడం నేరం కోర్టులో ఉంది అంటూ అధికారులు దాటవేస్తు చేతులు దులుపుకుంటున్నారు దీని వెనుక మతలబు ఏమిటో స్పష్టంగా తెలుస్తుంది అని అట్టి భూమిని గ్రామాల అవసరాలకు కేటాయించి మిగిలినది అర్హులు అయిన న8రూపేదలకు పంపిణీ చేయాలని లేని పక్షంలో తివ్ర ఉద్యమం తప్పదని దానికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది అని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పరాజితుల బృందంతో పాటు సీనియర్ రైతు నాయకులు ఐయిలేని కమాలకర్ రావు,కొండ గంగారాం,పలువురు నాయకులు సతీష్,తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img