హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనాలకు అనుమతులు లేదంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. ట్యాంక్‌బండ్ మార్గంలో జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్ పోలీసుల పేరిట ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు సాగర్‌లో విగ్రహాల నిమజ్జనాలకు అనుమతి లేదని అందులో పేర్కొన్నారు. అయితే.. ఈ ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారనే విషయంపై స్పష్టత లేదు. దీనిపై జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించాల్సి ఉంది.