Homeహైదరాబాద్latest Newsవరంగల్, ఖమ్మం, నల్గొండ, పట్టభద్రుల ఎమ్మెల్సీ బై ఎలక్షన్ సందర్భంగా నాలుగు మండలాల పరిధిలో 144...

వరంగల్, ఖమ్మం, నల్గొండ, పట్టభద్రుల ఎమ్మెల్సీ బై ఎలక్షన్ సందర్భంగా నాలుగు మండలాల పరిధిలో 144 సెక్షన్ అమలు

ఇదేనిజం, చేర్యాల టౌన్: పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ సోమవారం(27-05-2024) నాడు పట్టభద్రుల ఎమ్మెల్సీ బై ఎలక్షన్స్ సందర్భంగా సిద్దిపేట జిల్లాలోని చేర్యాల, కొమరవెల్లి, మద్దూర్, దూల్మిట్ట, మండలాల పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుంది అని అన్నారు. సిద్దిపేట జిల్లా పరిధిలో నాలుగు మండలాలలో పోలింగ్ కేంద్రాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు రేపు(25-05-2024) సాయంత్రం 4 గంటల నుండి ఈ నెల 28 ఉదయం 8 గంటల వరకు 144 సి.ఆర్.పి.సి సెక్షన్ అమలు చేస్తున్నట్లుగా కమిషనర్ తెలిపారు.

నాలుగు మండలాల పరిధిలో చేర్యాల పట్టణంలో మండల ప్రజా పరిషత్ స్కూల్ నందు రెండు పోలింగ్ కేంద్రాలు,కొమురవెల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ ఒక పోలింగ్ కేంద్రం,మద్దూరు జిల్లా పరిషత్ హై స్కూల్ ఒక పోలింగ్ కేంద్రం, దూల్మిట్ట జిల్లా పరిషత్ హై స్కూల్ ఒక పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ కేంద్రాలను జియో ట్యాగింగ్ పూర్తి చేయడం జరిగినది. ఎన్నికల నియమావళి ఎవరైనా ఉల్లంఘిస్తే, ఎన్నికల సమయంలో ఏ చిన్న సంఘటన జరిగినా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712667100, స్పెషల్ బ్రాంచ్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712667306, మరియు సమాచారం డైల్ 100 కు ఫోన్ చేసి తెలపగలరు, వెంటనే సమస్యను పరిష్కరిస్తామని కమిషనర్ తెలిపినారు.

Recent

- Advertisment -spot_img