– పక్క రాష్ట్రంలో ఉంటే ఇక్కడ ఓట్లు వేయొద్దా?
ఇదేనిజం, ఏపీ బ్యూరో: టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ కు రాజకీయాల్లో ఉండే అర్హత లేదని వ్యాఖ్యానించారు. ఈ సారి తొందరగా అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనసేనతో పొత్తులో ఉన్నామని సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుపుతున్నామని చెప్పారు. ఈ సారి అభ్యర్థుల ఎంపిక కోసం కొత్త విధానం తీసుకొస్తున్నామన్నారు. వైసీపీలో ఉన్న మంచి నేతుల తమ పార్టీలోకి వస్తామంటే చేర్చుకుంటామని చెప్పారు. మద్య నిషేధం చేయకుంటే ఓటు అడగను అని చెప్పిన జగనుకు.. ఇప్పుడు ఓటు అడిగే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల్లో ఓటు లేని వారికి.. ఈ రాష్ట్రంలో ఓటు ఉంటే.. వాళ్లూ ఓటేయొద్దని ఎలా చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం సవ్యంగా ఉంటే వాళ్లు వేరే రాష్ట్రాలకు ఎందుకు వెళ్తారని నిలదీశారు. జగన్ చేసేవన్నీ చెత్త పనులే అని మండిపడ్డారు. రుషికొండ మీద టూరిజం హోటల్ పేరుతో రూ. 500 కోట్లతో భవనం కడతారా అని అని మండిపడ్డారు.