ఏపీ ప్రభుత్వం పింఛన్లకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. దివ్యాంగ విద్యార్థులు పింఛన్లు తీసుకునే విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ప్రభుత్వం వారికి అకౌంట్లలో డబ్బుల్ని జమ చేయనుంది. నవంబర్ నుంచి.. నేరుగా వారి అకౌంట్లలో డబ్బుల్ని జమ చేయనున్నారు. ఈ నిర్ణయంపై దివ్యాంగ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దివ్యాంగుల కోటాలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద 8.50 లక్షల మంది పింఛన్లను ప్రతి నెలా తీసుకుంటున్నారు.