తెలంగాణ కేబినెట్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాలులో సమావేశం నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. డిసెంబర్ 28న భూమిలేనివారికి రూ.6 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అలాగే సంక్రాంతి పండుగ తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ-ఫార్ములా రేస్ నిధుల బదలాయింపుపై విచారణకు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ విషయంపై న్యాయనిపుణుల సలహాలు తీసుకుని గవర్నర్ ఆమోదం తెలిపారు అని ప్రభుత్వం పేర్కొంది.