శ్రీశైలం వెళ్లే భక్తులకు, వాహనదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక సూచన చేసింది. శ్రీశైలం-హైదరాబాద్, నాగార్జునసాగర్-శ్రీశైలం, దోర్నాల-శ్రీశైలం రహదారుల గుండా వెళ్లే భక్తులు.. అటవీ ప్రాంతంలో ఎలాంటి ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగిస్తే రూ.1000 వరకు జరిమానా విధిస్తామని తెలిపింది. ఈ దారుల్లో ఆహారం కూడా పడేయొద్దని ఆదేశించింది. ఈ దారుల్లో గంటకు కేవలం 30 కిలో మీటర్ల వేగంతోనే వెళ్లాలని సూచించింది.