తెలంగాణలో సంక్రాంతి నుంచి పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. నగర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వరదలకు ఉప్పొంగిన మున్నేరు నదికి ఇరువైపులా రిటైనింగ్ వాల్స్ నిర్మిస్తామని చెప్పారు.