Homeహైదరాబాద్latest Newsఐపీఎల్‌ 2024పై కీలక అప్​ డేట్​

ఐపీఎల్‌ 2024పై కీలక అప్​ డేట్​

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 జూన్‌లో వెస్టిండీస్, అమెరికా వేదికల్లో జరగనుంది. గత పదేళ్లుగా ఐసీసీ ట్రోఫీ గెల్చుకోని టీమిండియా ఈసారైనా వరల్డ్‌ కప్‌ను గెల్చుకోవాలన్న పట్టుదలతో ఉంది. ఈ మెగా టోర్నీకి ముందు టీమ్ ఇండియాకు టీ20 మ్యాచ్‌లు లేవు. కాబట్టి టీమిండియా ప్లేయర్లకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ చాలా ముఖ్యమైనది. ఇప్పుడు, ప్రపంచ నంబర్ టీ20 లీగ్ గురించి ముఖ్యమైన సమాచారం బయటకు వచ్చింది. Cricbuzz నివేదిక ప్రకారం, IPL 2024 మార్చి 22న ప్రారంభమవుతుంది. దాదాపు రెండు నెలల పాటు ఈ మెగా క్రికెట్‌ టోర్నీ కొనసాగుతుంది. మే 26న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. లోక్‌సభ ఎన్నికల తేదీ ప్రకటించిన తర్వాత అధికారికంగా షెడ్యూల్‌ను ప్రకటిస్తారని తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఐపీఎల్‌ రెండుసార్లు జరిగింది. IPL 2009 పూర్తిగా భారతదేశం వెలుపల దక్షిణాఫ్రికాలో నిర్వహించగా, 2014 ఎడిషన్‌లోని కొన్ని మ్యాచ్‌లు UAEలో జరిగాయి. అయితే ఈసారి మొత్తం టోర్నీని భారత్‌లోనే నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోందని క్రిక్‌బజ్ నివేదిక పేర్కొంది. మరోవైపు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ కూడా ఫిబ్రవరి 22న ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అది మార్చి 17తో ముగుస్తుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం తొలి మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుండగా, ఫైనల్ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో జరగనుంది. అంటే ఈ టోర్నీ దాదాపు 2 నగరాల్లో జరగడం ఖాయం. మహిళల ప్రీమియర్ లీగ్ తొలి ఎడిషన్ ముంబైలో మాత్రమే నిర్వహించబడింది.

Recent

- Advertisment -spot_img