వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి రైతుల ఖాతాల్లోకి రైతుభరోసా డబ్బు జమ చేస్తామని మంత్రి తుమ్మల ప్రకటించారు. నిన్న అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రం అమలు చేస్తున్న PM కిసాన్ నిబంధనలను ప్రస్తావించారు. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్ దారులు, ప్రజాప్రతినిధులు, IT చెల్లింపుదారులు, వైద్యులు, ఇంజినీర్లు, న్యాయవాదులు, CAలు, ఆర్కిటెక్టులు అనర్హులని చెప్పారు. దీంతో PMKY నిబంధనలే రైతుభరోసాకూ అమలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.