తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలు అమలు చేస్తోంది. రైతు భరోసా, రైతు బీమా, ఫసల్ బీమా యోజన వంటి పథకాలు అమలవుతున్నాయి. రైతుబంధు పేరుతో మొన్నటి వరకు ఎకరాకు రూ.10 వేలు అందించిన సంగతి తెలిసిందే.. ఈ సారి రూ.15 వేలకు పెంచారు. అయితే వచ్చే నెలాఖరులోగా రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు ప్రకటించారు. రైతు రుణమాఫీ పథకాన్ని పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్న అధికారులు గ్రామాల్లో అర్హుల జాబితాను సేకరిస్తున్నారని తెలిపారు. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే రైతులకు రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు అందజేస్తామని తెలిపారు. అంతే కాకుండా.. ఈసారి కౌలు రైతుల కోసం రైతు భరోసా పథకాన్ని కూడా అందజేస్తామన్నారు. త్వరలోనే 15 వేలు రైతుల ఖాతాలో జమ చేస్తామన్నారు.