జైలర్ మూవీ విలన్ నటుడు వినాయకన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్’ సినిమాలో విలన్‌గా నటించిన నటుడు వినాయకన్ ఎప్పుడూ వివాదాల వార్తల్లో ఉంటాడు. తాజాగా గోవాలో ఓ వ్యాపారితో ఆయన మద్యం మత్తులో గొడవ పడుతున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.గోవాలో స్థానిక తినుబండారాల హోటల్ నిర్వాహకులపై గొడవ పడుతున్నాడు. ఆ సమయంలో వారిపై అసభ్య పదజాలం వాడుతూ కనిపించాడు. ఈ వీడియో ప్రస్తుతం అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్‌గా మారింది.