టీమిండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌కు డీఎస్పీ పదవిని కేటాయించిన విషయం సంగతి తెలిసిందే.. ఈ మేరకు డీఎస్పీ యూనిఫాంలో ఉన్న మహమ్మద్ సిరాజ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఫోటో చూస్తుంటే సిరాజ్ యూనిఫాం ధరించి విధుల్లో చేరేందుకు వచ్చినట్లు స్పష్టమవుతోంది.ఇటీవల టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. ఈ టీమ్‌లో సిరాజ్ కూడా సభ్యుడు. దాంతో సిరాజ్‌ను తెలంగాణ ప్రభుత్వం సన్మానించింది. జూబ్లీహిల్స్‌లో 600 గజాల ఇంటి ప్లాట్‌తో పాటు గ్రూప్-1 హోదాతో డీఎస్పీ ఉద్యోగం కూడా ఇచ్చింది.