తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని మాజీ కేంద్ర మంత్రి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ధీమా వ్యక్తం చేశారు.
శుక్రవారం అనంతగిరిలో శ్రీఅనంతపద్మనాభ స్వామిని విద్యాసాగర్ రావు దర్శించుకున్నారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ సహాకారంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు.
చనిపోయిన తర్వాత తన శవంపై పార్టీ జెండా కప్పాలనేది బీజేపీ పార్టీ ప్రతీ కార్యకర్త కోరిక అని… అందుకే తాను తిరిగి పార్టీలో సభ్యత్వం తీసుకున్నానన్నారు.
బీజేపీకి రెండు సీట్లు ఉండడం శుభపరిమాణమన్నారు. గతంలో రెండు సీట్లతోనే దేశంలో నేడు అధికారంలోకి వచ్చామని గుర్తుచేశారు.
రాష్ట్రంలో తమకు రెండు సీట్లు ఉన్నా రానున్న రోజుల్లో అధికారంలోకి వస్తామని తెలిపారు.
ఇప్పుడున్న రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుకున్నదానికంటే ఎక్కువగా పార్టీ కోసం పనిచేస్తున్నారన్నారు.
ఆయన కృషి ఫలితంగానే రాష్ట్రంలో అధికారంలోకీ వచ్చి తీరుతామని విద్యాసాగర్ రావు స్పష్టం చేశారు.
Vidyasagar Rao said that even though they have two seats to BJP in the state, they will come to power in the coming days. Incumbent state president Bandi Sanjay is working for the party more than he thought. Vidyasagar Rao made it clear that he would come to power in the state as a result of his efforts.