Homeహైదరాబాద్latest Newsతెలంగాణ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో.. 4 వేల లావాదేవీలకు రూ.20.8 కోట్ల ఆదాయం..!

తెలంగాణ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో.. 4 వేల లావాదేవీలకు రూ.20.8 కోట్ల ఆదాయం..!

తెలంగాణ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ తాజాగా విడు­దల చేసిన అధికారిక నివేదిక ప్రకారం రాష్ట్రంలో రో­జుకు సగటున 4 వేల వరకు క్రయవిక్రయ లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ లావాదేవీల కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి రోజుకు సగటున రూ.20.8కోట్ల ఆదాయం సమకూరుతోంది. ఈ పదేళ్లలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తులకు సంబంధించి మొత్తం 1,46,18,601లావాదేవీలు జరగ్గా, వీటిద్వారా రూ.76,201.17కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు సమకూరింది.

spot_img

Recent

- Advertisment -spot_img