Homeహైదరాబాద్latest Newsఆ హత్య కేసులో.. ఆ స్టార్ హీరోకి బెయిల్ రద్దు

ఆ హత్య కేసులో.. ఆ స్టార్ హీరోకి బెయిల్ రద్దు

రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్, పవిత్ర గౌడల బెయిల్ పిటిషన్‌ను బెంగళూరులోని కోర్టు సోమవారం తిరస్కరించింది. ఉపశమనం కోరిన ఆరుగురు నిందితుల్లో ఇద్దరికి బెయిల్ మంజూరు చేయగా, మిగిలిన నలుగురి అభ్యర్ధనలు తిరస్కరించబడ్డాయి. దర్శన్, పవిత్ర గౌడ, నాగరాజ్, లక్ష్మణ్‌ల బెయిల్ పిటిషన్లను సెషన్స్ కోర్టు తిరస్కరించగా, నిందితులు రవిశంకర్, దీపక్‌లకు బెయిల్ మంజూరు చేసింది. హీరో దర్శన్‌కు వీరాభిమాని అయిన రేణుకాస్వామి పవిత్ర గౌడపై సోషల్ మీడియాలో కించపరిచే వ్యాఖ్యలు చేయడంతో దర్శన్ తన అనుచరులతో రేణుకాస్వామిని హత్య చేయించాడు. ఈ కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ జూన్ 11న అరెస్టయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఆయనతో పాటు పవిత్రగౌడ్‌తో పాటు మరో 15 మందిని అరెస్టు చేశారు.

Recent

- Advertisment -spot_img