టాలీవుడ్ హీరో, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణుకు వ్యతిరేకంగా యూట్యూబ్ ఛానెల్‌లలోని వీడియోలు, కంటెంట్‌ను తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. వ్యక్తి ప్రతిష్ట దిగజార్చేలా ఉన్న కంటెంట్‌ను వెంటనే తొలగించాలని కోర్టు తీర్పునిచ్చింది. తన స్వరం, తన పేరును, తన ఇమేజ్‌ను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దుర్వినియోగం చేయవద్దని కోర్టు హెచ్చరించారు. ఈ మేరకు పది యూట్యూబ్ లింక్‌లకు హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది.
ఈ తీర్పు సోషల్ మీడియాలో నటులు, వారి కుటుంబాల పై అసభ్యకరమైన సమాచారాన్ని అరికట్టేందుకు విష్ణు మంచు చేపట్టిన విస్తృత ప్రయత్నాలను బలపరుస్తోంది. మంచు విష్ణు అనైతిక యూట్యూబ్ ఛానెల్‌లలో అవమానకరమైన సమాచారాన్ని పోస్ట్ చేసే వారిపై చర్యలు తీసుకునేందుకు చొరవ తీసుకున్నారు. అతని చర్యల ద్వారా ఇప్పటివరకు 75 దుర్వినియోగ యూట్యూబ్ లింక్‌లు తొలగించబడ్డాయి. విష్ణు మంచు వ్యక్తిత్వ /ప్రచారం హక్కులను అపహరించడం, దుర్వినియోగం చేయడం వంటివి చేయకూడదని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అసభ్యకరమైన సమాచారాన్ని కలిగిన లింకులని నిలిపివేయాలని ఐటీ, టెక్నాలజీ మంత్రిత్వ శాఖలను కోర్టు ఆదేశించింది. నిందితులు 48 గంటలలోపు అన్ని ఉల్లంఘనల విషయాలను తొలగించవలసి ఉంటుంది, లేకపోతే యూట్యూబ్ ఈ విషయాలను నిరోధించి,నిలిపివేయవలసి ఉంటుందని కోర్టు తెలిపింది.