Homeహైదరాబాద్latest Newsతెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో.. కీలక పరిణామం

తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో.. కీలక పరిణామం

తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య లొంగిపోయారు. ఈరోజు మంగళగిరి కోర్టుకు వచ్చిన చైతన్య న్యాయమూర్తి ఎదుట లొంగిపోయాడు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిలో చైతన్య ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవలి ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చైతన్య అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పానుగంటి చైతన్య.. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రధాన అనుచరుడిగా గుర్తింపు పొందారు. ఈ కేసులో మంగళగిరి పోలీసులు లేళ్ల అప్పిరెడ్డిని కూడా విచారిస్తున్న సంగతి తెలిసిందే.

Recent

- Advertisment -spot_img