ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ కీలకమైన నిర్ణయం తీసుకుంది. జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలో ఎవరైనా మరణిస్తే వారి కోసం, వారి యొక్క కుటుంబానికి ఆర్థికంగా భరోసా కల్పించాలని నిర్ణయించింది. అందులో కొన్ని సహజ మరణాలు ఉంటే మరికొన్ని అసహజ మరణాలు ఉంటాయి. అది కూడా అసహజ మరణాలకు మాత్రమే అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అనగా తోటి ఖైదీలతో ఘర్షణ, జైలు సిబ్బంది వేధింపుల వల్ల ఖైదీ ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందజేస్తారు. జైలు అధికారులు లేదా వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఖైదీ చనిపోతే లేదా ఖైదీ ఆత్మహత్య చేసుకున్నా రూ.3.5 లక్షలు చెల్లిస్తారు.జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాల మేరకు ఏపీ హోం శాఖ ఈ నిబంధనలను రూపొందించింది.