అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా ‘పుష్ప 2’. ఈ సినిమా డిసెంబర్ 05న విడుదలై బాక్సాఫీస్ వద్ద రాంపేజ్ కలెక్షన్స్ రాబడుతుంది. ఈ సినిమా ఇప్పటికే పలువురు స్టార్ హీరోల రికార్డులను బద్దలు కొట్టింది. తెలుగులోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబడుతోంది. బాలీవుడ్‌లో 2వ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా రికార్డు నెలకొల్పింది. తాజాగా 100 ఏళ్ల బాలీవుడ్ చరిత్రలోనే ”పుష్ప-2” మూవీ అరుదైన రికార్డు సాధించింది. హిందీలో అత్యధిక కలెక్షన్లు రూ.632.50 కోట్లు సాధించినట్లు చిత్రబృందం వెల్లడించింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదే హైయెస్ట్ అని కేవలం 15 రోజుల్లోనే ఆల్ టైమ్ రికార్డు సృష్టించినట్లు చిత్రబృందం సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.