Homeజిల్లా వార్తలురుణమాఫీ పేరుతో ప్రభుత్వం రైతులను మోసం చేసిందని.. బీఆర్ఎస్ పార్టీ యువత వినూత్న నిరసన..!

రుణమాఫీ పేరుతో ప్రభుత్వం రైతులను మోసం చేసిందని.. బీఆర్ఎస్ పార్టీ యువత వినూత్న నిరసన..!

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండలం, చిప్పలపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ యూత్ గ్రామ అధ్యక్షుడు గాడిచెర్ల భరత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రైతులను రుణమాఫీ పేరుట మరోసారి మోసం చేస్తుందని మహాత్మా గాంధీజీ విగ్రహం ముందర వినూత్న రీతిలో కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. అలాగే రైతు భరోసా వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ యూత్ రాష్ట్ర నాయకులు మెంగని మనోహర్, మాజీ సర్పంచ్ తాడేపు ఎల్లం, యూత్ మండల అధ్యక్షుడు శీలం స్వామి, మాజీ ఏఎంసి వైస్ చైర్మన్ కొమ్మేట రాజమల్లు, ఎండి.జహంగీర్, వంగూరి దిలీప్, పోతారం సతీష్, మల్లారెడ్డి, దేవరాజు, నాయకులు హనుమయ్య, గట్టయ్య, రమేష్, లింగంస్వామి, శ్రీకాంత్, విజయ్, రాకేష్, చందు, దేవరాజ్, అనీల్, గార్లు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img