Homeహైదరాబాద్latest Newsతెలుగు రాష్ట్రాల్లో అంబరాన్నింటిన మువ్వన్నెల సంబురాలు.. జెండా ఎగురవేసిన ప్రముఖులు..!

తెలుగు రాష్ట్రాల్లో అంబరాన్నింటిన మువ్వన్నెల సంబురాలు.. జెండా ఎగురవేసిన ప్రముఖులు..!

78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా మువ్వన్నెల సంబురాలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాలలోని ప్రముఖులు జెండా ఎగరవేశారు.

గోల్కొండ కోటపై జెండా ఎగురవేసిన తెలంగాణ సీఎం రేవంత్
సీఎం హోదాలో రేవంత్ రెడ్డి గోల్కొండ కోటపై తొలిసారి జాతీయ జెండాను ఎగురవేశారు. పతాక ఆవిష్కరణ తర్వాత జాతీయ గీతం జనగనమన ఆలపించారు. అనంతరం తెలంగాణ గీతం జయ జయహే తెలంగాణ పాట ప్లే చేశారు. సాయుధ బలగాల గౌరవ వందనం తర్వాత పలు సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. ఈ సందర్భంగా భారత దేశ ప్రజలందరికీ రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

జెండా ఆవిష్కరించిన ఏపీ సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరుగుతున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జనగనమన ఆలపించారు. అనంతరం ప్రత్యేక సాయుద బలగాలతో గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్ర్య వేడుకల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

జాతీయ జెండా ఎగురవేసిన జగన్‌
తాడేపల్లిలోని YCP కేంద్ర కార్యాలయంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు‌ జగన్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతీయ నేతల చిత్రపటాలకు ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులంద‌రికీ మ‌న‌స్ఫూర్తిగా నివాళుల‌ర్పిస్తున్నాను అంటూ జగన్‌ ట్వీట్‌ చేశారు. ఈ వేడుకల్లో పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.

డిప్యూటీ సీఎం హోదాలో పవన్ పతాకావిష్కరణ
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఆయన తొలిసారి జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. పేదరిక నిర్మూలన కోసం తమ ప్రభుత్వం పని చేస్తోందని ఈ సందర్భంగా తెలిపారు.

Recent

- Advertisment -spot_img