Homeహైదరాబాద్latest Newsపవన్ కళ్యాణ్ కు సీఎం రేవంత్ రెడ్డి ఏ కోణంలో మంచిగా కనిపించారు : బండి...

పవన్ కళ్యాణ్ కు సీఎం రేవంత్ రెడ్డి ఏ కోణంలో మంచిగా కనిపించారు : బండి సంజయ్

అల్లు అర్జున్ అరెస్టుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని పవన్ కళ్యాణ్ ప్రశంసించడాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్ తప్పుబట్టారు. పవన్ కళ్యాణ్ కు రేవంత్ రెడ్డిలో ఏం మంచి కనిపించింది అని అన్నారు. పవన్ కు రేవంత్ రెడ్డి ఏ కోణంలో మంచిగా కనిపించారు.. 6 గ్యారంటీలు అమలు చేయనందుకు రేవంత్ రెడ్డి మంచిగా కనిపించాడా అని బండి సంజయ్ ప్రశ్నించారు. అసలు రేవంత్ రెడ్డి గొప్ప అని పవన్‌ కళ్యాణ్‌కు ఎలా అనిపించిందో.. అది రేవంత్ గొప్పదనమో లేదా ఇద్దరి మధ్య ఉన్న అండర్‌స్టాండింగ్ గొప్పదనమో తెలియదు అని బండి సంజయ్ సెటైర్ వేశారు.

Recent

- Advertisment -spot_img